AP Grama Sachivalayam 3rd Notification Confirm Vacancies List | Official Notification

AP Grama Sachivalayam 3rd Notification Confirm Vacancies List |Official Notification

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,026 పోస్టులు ఉన్నట్లుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గెజిట్ విడుదల చేసింది.

ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న ఖాళీల్లో కొన్ని పోస్టులు కరోనా కారణంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం కల్పించాలని ఈ గెజిట్ స్పష్టం చేయడం జరిగింది .

కరోనా మహమ్మారి తో మృతిచెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో కొందరికి ఇప్పటికే కారుణ్య నియామకాలు కల్పించగా ఇంకా మిగిలిపోయిన కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” Saikumar Techy ” యూట్యూబ్ ఛానల్ ను సబ్ప్రైబ్ చేసుకోండి. మా Telegram Group లో జాయిన్ అవ్వండి.

రాష్ట్రంలో ఇలా మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లోని వారికి ఇప్పటివరకు 1,488 మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన 1,149 మంది దరఖాస్తుదారులకూ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కల్పించేందుకు ఉత్తర్వులు పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది.. ఇక ఈ కారుణ్య నియామకాల భర్తీకి ప్రభుత్వం టైమ్లను కూడా నిర్దేశించింది.

  • అర్హులైన వారికి నియామక పత్రాలను ఆగస్టు 24లోగా జారీచేయాలి.
  • సమ్మతి నివేదికను సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి సమర్పించాలి.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో మొత్తం 13,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిల్లో ఆ 1,149 దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వోద్యోగాలు ఇవ్వాల్సిందిగా సీఎస్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ విషయంలో విద్యార్హతలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లను ఆయన ఆదేశించారు.

AP Grama Sachivalayam Final Vacancies

గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శి, గ్రామ సర్వేయర్, వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్రెడ్డి

కారుణ్య నియామకాల్లో క్రింది మార్గదర్శకాలు పాటిస్తారు

1. మృతిచెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయస్సు, విద్యార్హతల ఆధారంగా జీవితభాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

2. ఉద్యోగ నియామక పత్రం జారీచేసిన 30 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా భర్తీ చేయాలి.

S.NODESIGNATION OF
POST
Vacancies as
reported by
Line
Departments
1Panchayat Secretary
(Grade-V)
182
2Panchayat Secretary
Grade VI
(Digital Assistant)
731
3Welfare and Education
Assistant
543
4Village Agriculture
Assistant
467
5Horticulture Assistant1005
6Sericulture Assistant24
7Veterinary Assistant4765
8Fisheries Assistant62
9Engineering Assistant
(Grade-II)
982
10Village Revenue
Officer/
Ward Revenue
Secretary
112
11Village Surveyor
Assistant (Grade-III)
1027
12Ward Administrative
Secretary
225
13Ward Planning &
Regulation Secretary
(Grade-II)
479
14Ward Education and
Data Processing
Secretary
225
15Ward Welfare &
Development
Secretary
(Grade-II)
167
16Ward Amenities
Secretary (Grade-II)
477
17Ward Sanitation &
Environment
Secretary
(Grade-II)
371
18Mahila Police & Ward
Women& Weaker
Sections Protection
Secretary (Female)
1092
19ANM / Ward Health
Secretary
90
TOTAL13026

Download Official Notification